కేంద్రం తీసుకువచ్చిన VB-GRAMG బిల్లు: వికలాంగుల ఉపాధి హక్కుపై భారం

మనప్రజాప్రతినిధి//మెదక్.డిసెంబర్21 మెదక్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ రోజ్‌గార్ - ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 (VB-GRAMG) వికలాంగుల జీవనోపాధి హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య హెచ్చరించారు.ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో బిల్లుప్రతులను దగ్ధం చేశారు. యం. అడివయ్య మాట్లాడుతూ, కేంద్రం తీసుకువచ్చిన VB-GRAMG బిల్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను నిర్ధిష్టంగా ప్రభావితం చేస్తుందని...