manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 1:00 pm Posted by : Mana Praja Prathinidhi

డోర్లు–కిటికీలు లేని నూతన గ్రామపంచాయతీ రోడ్డు పైనే గ్రామసభ నిర్వహణ

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం,సిద్దిపేట జిల్లాడిసెంబర్ 31
అక్బర్‌పేట్ భూంపల్లి మండలంలోని అల్మస్‌పూర్ గ్రామంలో నూతన సర్పంచ్ మీరపురం పద్మ మల్లేశం అధ్యక్షతన గ్రామపంచాయతీలో నూతన గ్రామసభ నిర్వహించారు.నూతనంగా నిర్మించిన గ్రామపంచా యతీ భవనం పూర్తికాకపోవడం, డోర్లు–కిటికీలు ఏర్పాటు కాకపో వడంతో గ్రామసభను రోడ్డు పైనే నిర్వహించాల్సి వచ్చింది.గ్రామసభలో గ్రామంలోని పలు సమస్యలపై చర్చ జరిగింది. ముఖ్యంగా గ్రామ పరిశుభ్రత, ఎంపీడబ్ల్యూ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, గ్రామంలో నూతన కరెంట్ స్తంభాల ఏర్పాటు, వీధి దీపాల సమస్యలపై గ్రామస్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.అలాగే ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల నిర్వహణకు గోరిమిండ్ల మహీష్‌ను నియమించడం వంటి అంశాలు గ్రామసభలో చర్చకు వచ్చాయి.గ్రామ అభివృద్ధి దిశగా రైతు వేదిక వద్ద నూతన గోదాం, అంగన్వాడీ నూతన భవనం, డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేక భవనం, బ్రేక్ కట్టల నిర్మాణం వంటి అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు చేశారు.
గ్రామపంచాయతీకి అవసరమైన నిధులను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని సర్పంచ్ పద్మ మల్లేశం తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీరపురం పద్మ మల్లేశం, ఉప సర్పంచ్ జి. చంద్రం, మెంబర్లు బి. దుర్గవ్వ, పి. పద్మ, వి. నర్సింహారెడ్డి, బి. కనకయ్య, యం. నర్సిములు, గ్రామ కార్యదర్శి కీర్తన, ఆశ వర్కర్ ఇంద్ర, అలాగే గ్రామస్తులు పాల్గొన్నారు.