manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 3:21 pm Editor : Mana Praja Prathinidhi

కష్టసమయంలో అండగా గ్రామ పాలకవర్గం

మృత ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్
మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్.డిసెంబర్25
కొండపాక మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళ తండ్రి గోశిక నరసయ్య అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బూరుగుల మానస సురేందర్ పరామర్శించి రూ.5,000ల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా గ్రామ పాలకవర్గం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అమ్ముల పరశురాములు, వార్డు సభ్యులు బాబు, కవ్య రవి, రాజు, భాస్కర్, వజ్రమని రాజు, శ్రావణి తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.