కొమురవెల్లి మల్లన్న కళ్యాణం ఘనంగా ఘటించబడింది
వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి వివాహం; 50,000 మంది భక్తులు హాజరుమనప్రజాప్రతినిధి//కొమురవెల్లి,జనగామనియోజకవర్గం:డిసెంబర్ 14తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ఈ వారంలో ఘనంగా మల్లన్న కళ్యాణం జరిగింది. ఉదయం 10:45 గంటలకు, వీరశైవ అర్చకుల వేదమంత్రాల మధ్య, వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి బలిజమేడలమ్మ, గోళ్లకేతమ్మలను వివాహమాడా రు.రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఈ ఘన కార్యక్రమాన్ని వీరశైవ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 మహామండలేశ్వర్ డాక్టర్ మహంతీ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్...