గ్రామంలో అధికారులు50మందికి పైగా…కానీ ప్రజలకు అందుబాటు ఎంత?

“దేశానికి పట్టు కొమ్మలు గ్రామాలు” అని మనం గర్వంగా చెబుతాం.కానీ ఆ గ్రామాల్లో ప్రభుత్వ వ్యవస్థ నిజంగా ప్రజలకు సేవ చేస్తున్నదా?లేదా కేవలం జాబితాల్లో మాత్రమే ఉందా? అన్న ప్రశ్నలు నేడు ప్రతి గ్రామంలో వినిపిస్తున్నాయి.ఒక సాధారణ గ్రామాన్ని తీసుకుంటే సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, కార్యదర్శి, వీఆర్‌ఓ, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, టీచర్లు, లైన్‌మన్, హెల్పర్లు, అగ్రికల్చర్ అధికారులు, ఐకేపీ సభ్యులు, పోలీస్ అధికారులు, రేషన్ డీలర్లు, మధ్యాహ్న భోజన సిబ్బంది… ఇలా లెక్కిస్తే...