manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 4:50 am Editor : Mana Praja Prathinidhi

ఉపసర్పంచ్ పదవేహాట్‌సీట్ వార్డ్ మెంబర్లలో పావులాట వేడి

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్8
ఉప సర్పంచ్ పదవికి ఈసారి గ్రామీణ రాజకీయాల్లో భారీ డిమాండ్ నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా లేక సర్పంచ్ కుర్చీ అందని చోట్ల, వార్డ్ మెంబర్‌గా గెలిచిన చాలామంది ఉప సర్పంచ్ స్థానం కోసం చురుకుగా కదలికలు ప్రారంభించారు.పంచాయతీ నిధులు, బిల్లుల ఆమోదం వంటి కీలక విషయాల్లో సర్పంచ్, సెక్రటరీతో పాటు ఉప సర్పంచ్‌కు కూడా ‘జాయింట్ చెక్ పవర్’ ఉండటమే ఈ పదవిని హాట్‌సీటుగా మార్చింది.ముఖ్యంగా మేజర్ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవి కోసం రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు గ్రామీణ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డ్ సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి నగదు ఆఫర్లు, హామీలు ఇచ్చేప్రయత్నాలు మరింత వేగం పుంజుకున్నాయి.గ్రామాల్లో రాజకీయ పావులు కదులు తున్న తరుణంలో, ఉప సర్పంచ్ పదవిపై పోటీ గ్రామీణ రాజకీయాల నుమరింత వేడెక్కిస్తోంది.