manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 11:21 am Editor : Mana Praja Prathinidhi

ఇల్లంతకుంటలోరవాణాశాఖతనిఖీలు

ఎం.వి.ఐ వంశీధర్
మనప్రజాప్రతినిధి//మనకొండూరు,డిసెంబర్4
ఇల్లంతకుంట మండల పరిధిలోని పలు గ్రామాల్లో రవాణాశాఖ అధికారులు వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీల్లో లారీ, ట్రాక్టర్‌ సహా పలు నియమాలు ఉల్లంఘించిన వాహనాలను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎం.వి.ఐ వంశీధర్ తెలిపారు.
వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని,

సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను రోడ్లపై నడపరాదని సూచించారు. ఈ తనిఖీల్లో పిసి ప్రశాంత్ సహా రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.