జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ టీయూడబ్ల్యూజే ధర్నా కరపత్రాల ఆవిష్కరణ
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 02జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహా ధర్నా కోసం రూపొందించిన కరపత్రాలను టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు మారుపాక అనిల్ కుమార్, మండల ప్రెస్‌క్లబ్ సభ్యులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు వీరాహత్ అలీ, జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ పిలుపు మేరకు జరిగింది.ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడం, జర్నలిస్టుల ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించడం, అర్హులైన వారికి ఇళ్ల...