manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 12:37 pm Editor : Mana Praja Prathinidhi

మల్కాపూర్ తండాలో ఏకగ్రీవ విజయ పతాకం

సర్పంచ్‌గా ధరావత్ బన్సీ లాల్ – ఉప సర్పంచ్‌గా నేనావత్ పరమేష్ ఎన్నిక.మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//మల్కాపూర్ తండా.
మెదక్ మండలంలోని మల్కాపూర్ తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి ధరావత్ బన్సీ లాల్ గారు, ఉప సర్పంచ్‌గా నేనావత్ పరమేష్ గారు గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 333 ఓట్ల ఆధారంగా గ్రామం ఈ నిర్ణయానికి ఏకమై నిలిచినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.ఎన్నికైన వార్డు సభ్యులు2వ వార్డు: మెగావత్ రామ్ సింగ్3వ వార్డు: రమీక్కీ4వ వార్డు: ఎడమలపల్లి సుగుణ5వ వార్డు: ధరావత్ గోపాల్6వ వార్డు: ధరావత్ అంజయ్యగ్రామ అభివృద్ధికే ప్రాధాన్యం – కొత్త సర్పంచ్ బన్సీ లాల్పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత సర్పంచ్ బన్సీ లాల్ మాట్లా డుతూ “తాండా ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టు కుంటాను. ఏ కష్టం వచ్చినా ప్రజలకు అండగా నిలుస్తా. ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తాను. మల్కాపూర్ తండాని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లడం మా లక్ష్యం” అని అన్నారు.ఉప సర్పంచ్ పరమేష్ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ “తాండా అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎప్పటికప్పుడు ముందు ఉంటాం” అని తెలిపారు.గ్రామ ప్రజలు భారీ ఎత్తున హాజరై విజేతలకు అభినందనలు తెలియజేశారు.