మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 02
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (CEA) ప్రకారం వేములవాడలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో నిర్వహణ, సేవలపై అమలులో ఉన్న నిబంధనలు, విధివిధానాలను సమీక్షించారు.
ఈ సందర్శనలో డాక్టర్ల వివరాలు, పని చేస్తున్న సిబ్బంది నమోదులు, సేవల ధరల ప్రదర్శన, ఫైర్ సేఫ్టీ, రిజిస్ట్రేషన్, వ్యర్థ నిర్వహణ సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సమస్త వివరాలను రిసెప్షన్ వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు.వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు, వసతి సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని గుర్తుచేస్తూ, CEA ప్రకారం రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులపై చర్యలు తప్పవని డాక్టర్ రజిత హెచ్చరించారు.కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సంపత్‌కుమార్, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.