కాట్రపల్లిలో వైకుంఠ ఏకాదశి వైభవం.కోలా ఆనంద్ దంపతుల ఆధ్వర్యంలో ఘనమహోత్సవం
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్31వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కాట్రపల్లి గ్రామం భక్తి వాతావరణంతో పరవశించింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తమ స్వగ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథ స్వామీ వారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ మహోత్సవాన్ని కోలా ఆనంద్‌తో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు కోలా విశాలి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు నిర్వహించగా, అనంతరం కోలాటాల నడుమ పురవీధుల్లో ఊరేగింపులు...