ఉత్తర ద్వారం విశేషతతో ఘనంగా వైకుంఠ ఏకాదశి
మనప్రజాప్రతినిధి//తెలంగాణ-ఆంధ్రప్రదేశ్.డిసెంబర్ 30వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం విశేషతహిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినమైన వైకుంఠ ఏకాదశిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తాడని పురాణాల్లో ప్రస్తావన ఉంది.వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే పాప విముక్తి లభించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ దినాన భక్తులు ఉపవాసాలు, జపాలు, భజనలు చేస్తూ శ్రీమన్నారాయణునినామస్మరణలోలీనమవుతారు.ప్రత్యేకంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు...