manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 December 2025, 4:10 am Posted by : Mana Praja Prathinidhi

గ్రామాభివృద్ధే నా లక్ష్యంఆశీర్వదించండిసర్పంచ్అభ్యర్థిఆరేపల్లి శ్రీనివాస్

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం. డిసెంబర్6
కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్థానిక ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ఆరేపల్లి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ మాట్లాడుతూ…“గ్రామాభివృద్ధి చేయడమే నా ధ్యేయం. ప్రజల ఆశీర్వాదమే నా బలం” అని అన్నారు.గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సమానత్వం, పారదర్శక పాలనతో పని చేస్తానని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలతో కలిసి ప్రతి కుటుంబం మేలు చేకూరేలా నిరంతర శ్రమ చేస్తానని తెలిపారు. “ఒక్కసారిసర్పంచ్‌గాగెలిపించిఆశీర్వదించండిగ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాను” అని గ్రామస్తులను కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీ పాలనలోనే గ్రామానికి సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవు తుందని, దుద్దెడ గ్రామం ఎదగటానికి తాను సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని ఆయన గ్రామ ప్రజలను అభ్యర్థించారు.