కోతుల బెడదతో గ్రామస్తుల అల్లకల్లోలం చర్యలుతీసుకోవాలనిడిమాండ్
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం,సిద్దిపేటజిల్లాకొండపాక మండలం దుద్దెడ గ్రామంలో గత కొద్ది రోజులుగా కోతుల బెడద తీవ్రమైంది. గ్రామ పరిధిలో సుమారు 100 నుంచి 200 వరకు కోతులు ఇష్టానుసారంగా సంచరిస్తూ ప్రజలను తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తున్నాయి.గ్రామానికి చెందిన మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, పాఠశాల పిల్లలు రోడ్డుపై నడవడానికి భయపడుతున్నారని, ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోననే ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోతులు రహదారులపై సంచరిస్తూ, ప్రయాణికులపై దాడులు చేయడంతో ప్రమాదాలూ చోటుచేసు కున్నాయని పేర్కొన్నారు.ఎవరూ లేని సమయంలో ఇళ్లలోకి...