గ్రామీణ ప్రతిభకు వేదికగా వాలీబాల్-సిరిసిల్లలో క్రీడాభివృద్ధి ప్రయత్నాలు
•ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులురాజన్నసిరిసిల్ల,(మనప్రజాప్రతినిధి):డిసెంబర్30జిల్లాలో వాలీబాల్ క్రీడను అగ్రపథంలో నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. వాలీబాల్ క్రీడకు పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.అదేవిధంగా...