రాయపోల్.డిసెంబర్30(మనప్రజాప్రతినిధి):
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.రాయపోల్ ఎస్‌ఐ మానస సూచించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించకూడదని ఆమె హెచ్చరించారు. తాగి వాహనాలు నడపడం, రోడ్లపై గందరగోళం సృష్టించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎస్‌ఐమానస,నూతన సంవత్సరాన్ని శాంతియు తంగా, ఆనందంగా జరుపుకోవాలని, కుటుంబ సభ్యులతో సురక్షి తంగా వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు.నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక గస్తీ.తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.