manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 2:22 pm Posted by : Mana Praja Prathinidhi

రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికోసం పనిచేయాలి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లిసత్యనారాయాణ

మనప్రజాప్రతినిధి//మనకొండూరుడిసెంబర్ 17
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో రెండో విడత స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా వొల్లాల రజిత–వెంకటేశం గెలుపొందిన సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఎల్ఎండీ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికలతో రాజకీయాలు ముగిసినట్లేనని, ఇకపై గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పంచాయితీ పాలకవర్గాలు ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు.అభివృద్ధి పనులకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని, అవసరమైన నిధులు మంజూరు చేయడంలో ముందుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల సమగ్ర అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అనంతారం మాజీ సర్పంచ్, మండల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ, మాజీ ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి, కోఆపరేటివ్ మాజీ అధ్యక్షులు ఐరెడ్డి మహేంద్రర్ రెడ్డి, ముస్కాన్‌పేట సర్పంచ్ కోమటి రెడ్డి భాస్కర్ రెడ్డి, అనంతారం ఉప సర్పంచ్ కదం జయంత్, గ్రామ వార్డు సభ్యులు ఆక్కేం ఉపేందర్, గోనపల్లి లావణ్య–వెంకటేశం, చొప్పరి సాయిలు, సిరిపురం రమేష్, వొల్లాల లత–కిష్టయ్యతో పాటు గ్రామ నాయకులు గరిగె లక్ష్మీనారాయణ, వొల్లాల నరసయ్య, రాములు, మధు, మచ్చ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.