రామరాజ్య స్థాపనకు కృషి చేస్తాం-సర్పంచ్ మిద్దె శివకుమార్
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్24మన పర భేదం లేకుండా పరిపాలనలో పారదర్శకత పాటిస్తూ దుద్దెడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని దుద్దెడ గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ అన్నారు.దుద్దెడలోని సాయి కృప విద్యాలయంలో లీడ్ లైఫ్ హ్యాపీలీ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన రామాయణం బ్రోచర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వనజ అధ్యక్షతన ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్...