టూత్‌పేస్ట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి-వడ్లకొండ రమ్య పిలుపు
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం,సిద్దిపేటజిల్లా.డిసెంబర్12
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండల పరిధిలోని జప్తి నాచారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వడ్లకొండ రమ్య ప్రచారం జోరుగా కొనసాగుతోంది.అధికార పార్టీ సిద్దిపేట జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు వడ్లకొండ రవీందర్ గౌడ్ సతీమణిగా, పార్టీ నాయకుల ఆశీస్సులతో, గ్రామ ప్రజల అపార మద్దతుతో ఆమె ప్రజల మధ్య విస్తృతంగా పర్యటించా రు.ఈ నెల 17న జరగనున్న పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో, తమకు ఆశీర్వాదం అందించి టూత్‌పేస్ట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రమ్య పిలుపునిచ్చారు.గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి జండ్రల్ మహిళ రిజర్వు కావడంతో, ప్రజలు రమ్యను గెలిపించాలని ఏకగ్రీవం గా ప్రకటిస్తున్నట్లు వెల్లడైంది. రవీందర్ గౌడ్ అధికార పార్టీనాయకుడి గా,మంత్రుల వద్ద మంచి పేరు, రాజకీయ అనుభవం ఉన్న కారణంగా గ్రామస్థులు ఆయన కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకు న్నట్లు తెలుస్తోంది.“మీ అందరి అభిమానం, మద్దతు ఇలాగే కొనసా గాలని కోరుకుంటున్నాను” అంటూ వడ్లకొండ రమ్య–రవీందర్ గౌడ్ దంపతులు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.