ప్రపంచ కుటుంబ దినోత్సవం ఐక్యతే సమాజానికి పునాది

డిసెంబర్ 31 (మనప్రజాప్రతినిధి):ప్రపంచ కుటుంబ దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 1న జరుపుకుంటారు. నూతన సంవత్సర ఆరంభంతో పాటు కుటుంబ విలువలు, ఐక్యత, శాంతి ప్రాముఖ్యతను ప్రపంచానికి గుర్తు చేసే రోజిది. వేగంగా మారుతున్న జీవనశైలిలో కుటుంబం అనే వ్యవస్థ ఎంత కీలకమో గుర్తుచేయడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం.కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో తొలి పాఠశాల. ప్రేమ, గౌరవం, సహనం, బాధ్యత వంటి విలువలు మనకు కుటుంబంలోనే నేర్పుతాయి. చిన్ననాటి అనుభవాలు, పెద్దల మాటలు, కుటుంబంలో ఏర్పడే అనుబంధాలే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి....