నూతన సంవత్సర వేడుకల్లో యువత అప్రమత్తంగా ఉండాలి<br>
•రూల్స్ అతిక్రమిస్తే కేసులు తప్పవు-సదాశివపేట సీఐ డి. వెంకటేష్ హెచ్చరిక మనప్రజాప్రతినిధి//సదాశివపేట.డిసెంబర్30నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్లపై గందరగోళం సృష్టించవద్దని సదాశివపేట సీఐ డి. వెంకటేష్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. “తస్మాత్ జాగ్రత్త – రూల్స్ అతిక్రమిస్తే కేసులు తప్పవు” అని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించకూడదని సూచించారు. తాగి వాహనాలు నడపడం, రోడ్లపై హంగామా చేయడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం...