కొలనూర్ దుర్గమ్మ ఆలయం వద్ద వైన్ షాప్ నిర్మాణంపై నిరసనప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతి
మనప్రజాప్రతినిధిరాజన్న సిరిసిల్లజనవరి ,12: కొనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామంలో గ్రామ దేవత దుర్గమ్మ ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారుగ్రామ శివారులోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న దుర్గమ్మ ఆలయానికి సమీపంలో, కొత్తగా టెండర్ దక్కించుకున్న వైన్ షాప్ నిర్వాహకులు మద్యం దుకాణం ఏర్పాటు కోసం గదులను నిర్మిస్తున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆలయ పరిసరాల్లో మద్యం షాపును ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పూజలతో కళకళలాడే దుర్గమ్మ ఆలయం...