మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి20
రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ నివారణే లక్ష్యంగా చందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఎక్స్‌రే (Mobile X-Ray) మిషన్‌ను మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. రజిత అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, టీబీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నివారించేందుకు మొబైల్ ఎక్స్‌రే మిషన్ ఎంతో ఉపయోగపడు తుందని తెలిపారు. ముఖ్యంగా.60 ఏళ్లు పైబడిన వృద్ధులు,
బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు,
గతంలో టీబీ మందులు వాడిన వారు,బరువు తక్కువగా ఉన్నవారు, రక్తహీనతతో బాధపడేవారు,టీబీ బాధితుల కుటుంబ సభ్యులు
తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.గ్రామ స్థాయిలోనే ఈ మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీ వ్యాధి నిర్ధారణతో పాటు వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి (MRO), మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO), స్థానిక సర్పంచులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్, డాక్టర్ అనిత, డాక్టర్ వేణుగోపాల రెడ్డి, డాక్టర్ నహిమా, టీబీ యూనిట్ అధికారులు బిగిందర్, సూపర్వైజర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.