మహిళా అధికారుల గౌరవంపై దుష్ప్రచారం తగదు
మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహంవాస్తవాలతోనే వార్తలు రాయాలి కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దుహైదరాబాద్, జనవరి 10 (మనప్రజాప్రతినిధి): మహిళా ఐఏఎస్ అధికారుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా కథనాలు రాయడం సరికాదని హితవు పలికారు. నల్గొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కలెక్టర్ల బదిలీలు...