manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 7:17 am Posted by : Mana Praja Prathinidhi

సిరిసిల్ల సరిహద్దులో 2.342 కిలోల వెండి స్వాధీనం

అగ్రహారం చెక్‌పోస్ట్ వద్ద అలర్ట్ పోలీస్ యాక్షన్ స్వీఫ్ట్ కారులో లక్షల విలువైన వెండి పట్టుబాటు
•లక్షల విలువైన వెండి పట్టివేత

•ఎన్నికల తనిఖీల్లో భారీ దొంగరవాణా భగ్నం
బిల్లులు లేకుండా వెండి తరలింపు
SST తనిఖీల్లో భారీ పట్టివేత
•సిరిసిల్ల జిల్లాలో కఠిన తనిఖీలు
వెండి పట్టివేతతో కలకలం..

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి31
రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రహారం చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా వెండి ఆభరణాలు పట్టుబడటం కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే…శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో SST (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్) బృందం అగ్రహారం చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తోంది. ఈ సమయంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు (TS08FS6726)ను ఆపి తనిఖీ చేశారు.కారులో ప్రయాణిస్తున్న టి. సత్యనారాయణ వద్ద 2.342 కిలోల వెండి పట్టీలు లభ్యమయ్యాయి. అయితే, వీటి రవాణాకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేదా అధికారిక రశీదులు చూపకపోవ డంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వెండి విలువ లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.నిబంధనల ప్రకారం పంచనామా నిర్వహించి, స్వాధీనం చేసుకున్న వెండిని తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు అప్పగించారు.ఈ తనిఖీల్లో SST టీం ఇన్‌ఛార్జ్ జి. ఆనంద్‌తో పాటు సిబ్బంది నజీరుద్దీన్, తిరుమలేష్, బాబురావు మరియు వీడియోగ్రాఫర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.