డీలర్‌పై 6A కేసు నమోదు రేషన్ షాపులో భారీగా నిల్వల వ్యత్యాసం
ప్రజాప్రతినిధిన్యూస్//సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణంలోని రేషన్ షాపు నంబర్ 3908026లో భారీ ఎత్తున బియ్యం, చక్కెర నిల్వల వ్యత్యాసం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల డెప్యూటీ తాసిల్దార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించగా, డీలర్ ఆకునూరి అశోక్ నిర్వర్తిస్తున్న ఈ షాపులో రికార్డులకు, వాస్తవ నిల్వలకు మధ్య భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు.అధికారుల తనిఖీలో భాగంగా రికార్డుల ప్రకారం 92.51 క్వింటాళ్ల సన్న బియ్యం, 62.55 క్వింటాళ్ల పీడీఎస్ (దొడ్డు) బియ్యం, 87 కిలోల చక్కెర నిల్వలు ఉండాలి. అయితే, షాపులో కేవలం 31.50...