గ్రామీణ పశుపోషకులకు వరం…ఉచిత మెగా పశు వైద్య శిబిరానికి అపూర్వ స్పందన!
•రేణిగుంట గొల్లపల్లిలో రాస్ ఆధ్వర్యంలో 67 పశువులకు ఉచిత వైద్య సేవలు…36కుటుంబాలకు లబ్ధి.•రాస్ మెగా పశు వైద్య శిబిరంతో గ్రామీణ పశుపోషకులకు మేలు.రేణిగుంటమండలం,జనవరి20(మనప్రజాప్రతినిధి):రేణిగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో రాష్ట్రీయ సేవా సమితి (రాస్), రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరం గ్రామీణ పశుపోషకులకు నిజమైన వరంగా మారింది. ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి అపూర్వ స్పందన లభించింది.రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకటరత్నం, నాగరాజు వారి ఆదేశాల మేరకు రాస్ మహిళా...