161వ జాతీయ రహదారిపై మృత్యుఘాతం
•అతివేగంతో దూసుకెళ్లిన కారు బోల్తా-యువకుడికి స్పాట్‌డెత్ మెదక్.మనప్రజాప్రతినిధి//జనవరి17మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామ పరిధిలోని 161వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో దూసుకెళ్లిన కారు అదుపుతప్పి రోడ్డు కిందికి బోల్తా పడటంతో కారులో ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు ప్రమాదానికి గురై పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే సంఘటనా స్థలమే మృత్యు స్థలంగా మారింది. స్థానికులు వెంటనే...