manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 10:24 am Editor : Mana Praja Prathinidhi

రాస్  వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు సాధారణ  వైద్య శిబిరం.

ప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం డిసెంబర్ 6.

రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ జి మునిరత్నం .  90వ జయంతి రాస్ సేవా నిలయం పాపా నాయుడు పేట నందు ఘనంగా నిర్వహించడం జరిగింది
ముఖ్య అతిథులుగా  రాజశేఖర్ నాయుడు. అధ్యక్షులు బాల భారతి ప్రోగ్రాం రాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాట్లాడుతూ జి మునిరత్నం చేతుల మీదుగా . ప్రారంభించిన కార్యక్రమాల ద్వారా నాలుగు రాష్ట్రాలలో లక్షల మంది పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, రైతులకు మత్తు వ్యసనపరులకు, కుటుంబ కలహాల వారికి మొదలైన ఎన్నో కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూరుతుందని, సేవా కార్యక్రమాల ఆశాజ్యోతి అని కొనియాడినారు.
బాలాజీ నాయుడు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రాస్, వారు మాట్లాడుతూ కృషివలడు నిరంతరం సేవ తత్పురుషుడు ఆయన నాటిన విత్తనాలు నేడు మహావృక్షాలై ఎదుగుతున్నామని తెలియజేశారు. లలితా కరుణాకరన్ , పాపా నాయుడు పేట సర్పంచ్ వారు మాటలాడుతూ ఆయన చేసిన కార్యక్రమాల గురించి విన్నామే గాని ఆయన్ని చూసే భాగ్యం మేము నోచుకోలేదు ఆయన చేసిన కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి అని తెలియజేశారు.సతీష్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ . పూజా కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.హరిబాబు ప్రాజెక్ట్ ఆఫీసర్ జన శిక్షణ సంస్థాన్ ఆయన మాట్లాడుతూ టైలరింగ్ శిక్షణా కార్యక్రమం పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు జన శిక్షణ సంస్థ ద్వారా అందించడం జరిగింది.డాక్టర్ వెంకటేశ్వర్లు వాసన్ ఐ కేర్ తిరుపతి వారు కంటి సమస్యలకు ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో సులభముగా పరిష్కరించుకో వచ్చని కంటి సమస్యలను అలసత్వం చేయక చూపించుకొని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు .డాక్టర్ సుధాకర్ జనరల్ ఫిజీషియన్ & గైనకాలజిస్ట్ V సుప్రజ  DNR మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి  , స్త్రీల సమస్యల గురించి,నెమ్ము ఆయాసం నీరసం గుండె సమస్యలకు పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది బిపి షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించి తగిన సూచనలతో పాటు టానిక్లు టాబ్లెట్లను అందించడం జరిగినది కంటి ఆపరేషన్లకు 52 మంది ఎంపిక కావడం జరిగినది వీరందరికీ వాసన్ ఐ కేర్ హాస్పిటల్ నందు ఆపరేషన్ చేయడం జరుగుతుందని ప్రాజెక్టు ఆడిట్ మేనేజర్ సి బాలాజీ రెడ్డి తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో డ్రగ్ డి అడిక్షన్ సిబ్బంది రాస్ పొదుపు సంఘాల సిబ్బంది  MPO Vasan eye Care Hospital, DNR మల్టీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  సిబ్బంది పాల్గొనడం జరిగింది 359 మంది ఈ శిబిరంలో పాల్గొనడం జరిగింది.