కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ కలకలం గ్రామం ఖాళీ
గ్యాస్ లీకేజీతో భారీ మంటలుకొబ్బరి తోటలకు తీవ్ర నష్టంసీఎం చంద్రబాబు ఆదేశాలతో సహాయక చర్యలుమలికిపురం, జనవరి 5 (మనప్రజాప్రతినిధి): కోనసీమ జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ డ్రిల్లింగ్ కేంద్రంలో భారీ గ్యాస్ లీకేజీ చోటుచేసుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఓఎన్జీసీకి చెందిన మోరీ–ఐదు బావి వద్ద గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ పైకి చిమ్మడంతో...