ప్రజల నమ్మకం కోల్పోతున్న పాలన
- మాటల హామీలు… చేతల్లో ఖాళీ- దూరమవుతున్న పాలకులు – పెరుగుతున్న ప్రశ్నలు- నమ్మకం లేకుండా నిలిచే పాలన ఎంతకాలం?గంజాయి శ్రీనివాస్,జనవరి 5 (మనప్రజాప్రతినిధి):ప్రజాస్వామ్యంలో పాలనకు నిజమైన బలం అధికార యంత్రాంగం కాదు, ప్రజల నమ్మకం. కానీ నేటి పరిస్థితుల్లో ఆ నమ్మకం క్రమంగా కరిగిపోతున్నదన్న అభిప్రాయం బలపడుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం, ప్రజా సమస్యలపై స్పష్టమైన స్పందన లేకపోవడం వల్ల పాలనపై అసంతృప్తి పెరుగుతోంది.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో అనుసంధానం తగ్గిపోవడం, సమస్యలు చెప్పుకునే వేదికలు బలహీనపడటం ప్రజలను నిరాశకు...