manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 3:39 pm Editor : Mana Praja Prathinidhi

సిద్దిపేటలో ఆదర్శ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘన భోగిమంటల ప్రోగ్రాం

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జనవరి10స్థానిక సిద్దిపేట పట్టణంలోని ఆదర్శ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఈరోజు ఘనంగా భోగిమంటల ప్రోగ్రాం నిర్వహించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు.విద్యార్థులు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, పాటలు, నృత్య ప్రదర్శనలునిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థులు గాలిపటాలు ఎగురవేశారు, కానీ మాంజా దారాలు వాడకుండా, కేవలం సాదారణ దారాల ఉపయోగంతో మాత్రమే గాలిపటాలను ఎగురవేశారు. దీని ద్వారా మాంజా దారాల వల్ల కలిగే ప్రమాదాలు, ఇబ్బందులు విద్యార్థులకు అవగాహనగా మారింది.ప్రధాన అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ చెవిటి సంతోష్ కుమార్ హాజరై, భోగిమంటలను వెలిగించి విద్యార్థులను పూలతో ఆశీర్వదించారు. ఉపాధ్యాయినిలు.విద్యార్థుల ముత్యాల ముగ్గులు, భోగిమంటల పరంపర, సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.కార్యక్రమం విద్యార్థుల్లో సాంప్రదా య, సాంస్కృతిక విలువలపై అవగాహన మరియు భద్రతా నైపుణ్యా లు పాటించడంలో కూడా అవగాహన పెంపొందించడానికి ఉపయోగ పడింది. పాఠశాల వర్గాలు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత, సామూహిక చైతన్యం, సాంస్కృతిక పరిమాణంను మరింతగా పెంపొందించాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.