సిద్దిపేటలో ఆదర్శ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘన భోగిమంటల ప్రోగ్రాం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జనవరి10స్థానిక సిద్దిపేట పట్టణంలోని ఆదర్శ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఈరోజు ఘనంగా భోగిమంటల ప్రోగ్రాం నిర్వహించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు.విద్యార్థులు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, పాటలు, నృత్య ప్రదర్శనలునిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థులు గాలిపటాలు ఎగురవేశారు, కానీ మాంజా దారాలు వాడకుండా, కేవలం సాదారణ దారాల ఉపయోగంతో మాత్రమే గాలిపటాలను ఎగురవేశారు. దీని ద్వారా మాంజా దారాల వల్ల కలిగే ప్రమాదాలు, ఇబ్బందులు విద్యార్థులకు అవగాహనగా మారింది.ప్రధాన అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ చెవిటి సంతోష్ కుమార్ హాజరై, భోగిమంటలను వెలిగించి విద్యార్థులను పూలతో ఆశీర్వదించారు....