•ఎస్‌సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య చేతుల మీదుగా గౌరవం
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం.దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లా.జనవరి4
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మండల కుమార్‌ను ఎస్‌సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఘనంగా సన్మానించారు.
అక్బర్‌పేట్ గ్రామం నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన యువ నాయకుడు మండల కుమార్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు సర్పంచ్‌గా కాకుండా సేవకుడిగా పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. అతి చిన్న వయసులోనే మండల స్థాయి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలోఉపాధ్యక్షురాలు కాపర్ల భాగ్యలక్ష్మి,ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి మల్లేశం గౌడ్,కార్యదర్శి ఇదారి చంద్రకళ, కోశాధికారి పోషి గారి ప్రేమలత,సలహాదారు రంగయ్య గారి జెన్నారెడ్డి,నీల ప్రభాకర్, గువ్వల మౌనిక, తడకపల్లి రజిత,మీరాపురం పద్మ, పాతూరి లావణ్యతదితర సర్పంచుల ఫోరం సభ్యులను కూడా చైర్మన్ బక్కి వెంకటయ్య అభినందనలు తెలియజేశారు.ప్రజాసేవలో మండల కుమార్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మండల అభివృద్ధికి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు.