manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 3:44 pm Editor : Mana Praja Prathinidhi

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలకు ఘన సన్మానం

అవార్డులు అందజేసిన ఎమ్మెల్యే నజీర్
గుంటూరు,జనవరి5(మనప్రజాప్రతినిధి):
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే నజీర్ అవార్డులతో ఘనంగా సన్మానించారు. పార్టీ అభివృద్ధి, గెలుపు కోసం అంకిత భావంతో అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను గుర్తించి ఉత్తమ కార్యకర్తలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గాల్లో పార్టీ కోసం విశేషంగా సేవలందించిన కార్యకర్తలను ఎంపిక చేసి, ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో ఉత్తమ కార్యకర్తల అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ సన్నిధి శ్రీనివాసరావు చేసిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని, గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే ఉత్తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయనను ఎంపిక చేశారు. ఆయనకు అవార్డు, మెమెంటో అందజేసి ఎమ్మెల్యే నజీర్ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్‌తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.