దుర్గంధమైన వాసనలో ప్రయాణం…ఏర్పేడు–వెంకటగిరి రహదారిపై ప్రయాణికుల అవస్థలు

•చికెన్ వ్యర్థాలతో రోడ్లపై కుక్కల బెడద…పట్టించుకోని అధికారులు… ప్రమాదాల ముప్పులో వాహనదారులుమనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.జనవరి21తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండలం నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంగా రహదారి ఇరువైపులా చికెన్ వ్యర్థాలను విచ్చలవిడిగా పారవేయడంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధంతో నిండిపోయింది.పారవేసిన చికెన్ వ్యర్థాలను తినేందుకు కుక్కలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో వాహనదారులకు తీవ్ర ప్రమాదాలు ఎదురవుతున్నాయి. పగలు–రాత్రి అనే తేడా లేకుండా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం ఈ సమస్యపై...