శివనామస్మరణతో దేదీప్యమానమైన సదాశివపేట-సంగమేశ్వరునికి లక్ష బిల్వదళాల అభిషేకం..
•బ్రహ్మముహూర్తం నుంచి అఖండ నామస్మరణతో మహాదేవునికి విశేష పూజలు•శివస్వాముల ఆధ్వర్యంలో శ్రీ సంగమేశ్వర మందిరంలో ఘన ఆధ్యాత్మిక కార్యక్రమం•భారీగా తరలివచ్చిన భక్తులు-అన్నప్రసాదంతో పుణ్యఫలితం సదాశివపేట,జనవరి18(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణంలోని స్థానిక శ్రీ సంగమేశ్వర మందిరంలో ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య పరమేశ్వరునికి లక్ష బిల్వదళాలచే మహాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఉదయం నాలుగు గంటల నుంచే శివస్వాముల భక్తబృందం త్రిదళ పత్రాలతో “ఓం నమశ్శివాయ” నామస్మరణ చేస్తూ ముల్లోకాలకు అధిపతి అయిన మహాదేవునికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి మయంగా మారింది.అలాగే ఉదయం బ్రహ్మముహూర్తం నుంచి...