తల్లిలాంటి అత్తను అల్లుడే తన స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది..
మనప్రజాప్రతినిధి//కొండపాక (కుక్కునూరు పల్లి):ఆస్తి కోసం కన్న తల్లిలాంటి అత్తను అల్లుడే తన స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. ఈ నెల 6న కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని సార్లవాడ లో జరిగిన మహిళ హత్య కేసు వివరాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు శుక్రవారం కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం..తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఏలూరు రమ అలియాస్ రాములమ్మ (60) భర్త మృతి చెందడంతో సార్లవాడలో...