మంచినీటి సమస్యకు పరిష్కారం దిశగా అడుగు-ఆల్మస్‌పూర్‌లో వాటర్ ప్లాంట్ పనులకు భూమి పూజ

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం,సిద్దిపేట జిల్లా.జనవరి11అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని ఆల్మస్‌పూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మీరపురం పద్మ మల్లేశం.గ్రామ పెద్దల సహకారంతో. ప్రజల క్షేమం కోసం వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనుల ను ప్రారంభించారు.గ్రామంలో మంచినీటి కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ముందుగా వాటర్ ప్లాంట్ పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేసి ఆల్మస్‌పూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిది ద్దుతానని...