manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 2:37 pm Editor : Mana Praja Prathinidhi

స్వచ్ఛ గుంటూరు లక్ష్యంగా అదనపు పారిశుద్ధ్య కార్మికుల నియామకం

పారిశుద్ధ్య పనులు చేసేందుకు నూతనంగా దరఖాస్తులు ఆహ్వానం
గుంటూరు,జనవరి4(మనప్రజాప్రతినిధి):
గుంటూరు నగరంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు రోజువారీ వేతన ప్రాతిపదికన అదనపు కార్మికులు అవసరమని నగరకమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆసక్తి గల వ్యక్తులు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్‌లో నేరుగా లేదా 0863-2345103 నంబర్‌కు కాల్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకునే వారు తమ పూర్తి వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ కార్డు నకలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచి “స్వచ్ఛ గుంటూరు”గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రస్తుతం ఉన్న కార్మికులకు అదనంగా మరిన్ని కార్మికుల అవసరం ఉందన్నారు.కావున, రోజువారీ వేతనంపై కేటాయించిన ప్రాంతాల్లో కేటాయించిన పారిశుద్ధ్య పనులు చేయడాని కి ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు.