manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 10:59 am Editor : Mana Praja Prathinidhi

భూంపల్లి మండల వర్తక వ్యాపార సంఘం నూతన అధ్యక్షుడిగా అధికం లింగం గౌడ్ ఎన్నిక

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం,సిద్దిపేట జిల్లా.జనవరి11
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండల నూతన వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడిగా అధికం లింగం గౌడ్ ఎన్నికయ్యారు. ఆదివారం తేదీ 11-01-2026 న సంఘ సభ్యుల సమక్షంలో జరిగిన సమావే శంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.సంఘం కార్యవర్గ కమిటీకి రెండేళ్ల కాలపరిమితి పూర్తవడంతో, మెజార్టీ సభ్యుల సమక్షంలో కొండాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి వద్ద నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా అధికం లింగం గౌడ్,ఉపాధ్యక్షుడిగా పి. వెంకట్ గౌడ్,ప్రధాన కార్యదర్శిగా వి. నరేష్ గౌడ్,ఖజానాదారుగా జి. దేవరాజ్ ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సంఘాన్ని మరింత బలోపేతం చేసి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు.