manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 10:19 am Posted by : Mana Praja Prathinidhi

నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి27
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఇంచార్జి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి, నామినేషన్ల స్వీకరణకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల సంఖ్య, వాటిలో కల్పిస్తున్న సౌకర్యాలపై మున్సిపల్ కమిషనర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలనిఅధికారులకు సూచించారు. అదేవిధంగా, అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ఎన్ఓసీ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితర అధికారులు పాల్గొన్నారు.