సరస్‌కు సీఎం రాక సందర్భంగా ముందస్తు చర్యలు పూర్తి.
గుంటూరు,జనవరి7(మనప్రజాప్రతినిధి)నల్లపాడు రోడ్‌లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి డ్వాక్రా బజార్ (సరస్)ను ఈ నెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శించనున్న నేపథ్యంలో, పర్యటన మార్గంలో జీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసే వరకు విధులు కేటాయించబడిన అధికారులు, సచివాలయ కార్యదర్శులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.బుధవారం నగర కమిషనర్ కలెక్టర్ బంగ్లా రోడ్, జీటీ రోడ్,చుట్టగుంట నుంచి నల్లపాడు రోడ్ వరకు పర్యటించి, పారిశుధ్య అభివృద్ధి పనుల...