స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆత్మకూరు యువజన సంఘం ఘన నివాళి
సదాశివపేట్:మనప్రజాప్రతినిధి//జనవరి12.ఆత్మకూరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆత్మకూరు యువజన సంఘం సభ్యులు ఘన నివాళులు అర్పించారు. గత 20 సంవత్సరాలుగా ఈ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కార్యక్రమంలో స్వామి వివేకానంద విగ్రహానికి అభిషేకం చేసి, పూలమాలలతో అలంకరించి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు.ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించబడుతుంది. స్వామి వివేకానంద 1863 జనవరి 12న జన్మించారు. ఆయన ఆలోచనలు, సూత్రాలు, ఆదర్శాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ వేడుక ద్వారా యువతలో దేశభక్తి, ఆత్మవిశ్వాసం, సంకల్పం, ధైర్యం,...