manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 9:15 am Posted by : Mana Praja Prathinidhi

ఇర్కోడ్ విద్యార్థికి జపాన్ పర్యటన-రాష్ట్రానికే గర్వకారణం

సిద్దిపేట నియోజకవర్గం.ఇర్కోడ్,జనవరి14(మనప్రజాప్రతినిధి):
స్థానిక సిద్దిపేట మండలం రూరల్ పరిధిలో ఉన్నఇర్కోడ్ మోడల్ స్కూల్ కి  చెందిన వేణు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి జపాన్ దేశ పర్యటనకు ఎంపిక కావడం రాష్ట్ర స్థాయిలో గర్వకారణంగా నిలిచింది. నెహ్రూ సైన్స్ కార్యక్రమం ఆధ్వర్యంలో జపాన్ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ విద్యా-శిక్షణా పర్యటనకు ఇర్కోడ్ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని కఠినమైన ఎంపిక ప్రక్రియ అనంతరం ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా జపాన్‌లోఈ నెల 24 నుండి 30 వరకు జరిగే శిక్షణా పర్యటనలో 4 గైడ్ టీచర్లు అధికారులు.విద్యార్థి పాల్గొననున్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, విద్యా విధానాలు, పరిశ్రమల అభివృద్ధి, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు.విద్యార్థి ఎంపిక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని ఎస్ సిఆర్టీ డైరెక్టర్ రమేష్ అభినందిస్తూ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విద్యార్థి భవిష్యత్తు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.