ఇర్కోడ్ విద్యార్థికి జపాన్ పర్యటన-రాష్ట్రానికే గర్వకారణం
సిద్దిపేట నియోజకవర్గం.ఇర్కోడ్,జనవరి14(మనప్రజాప్రతినిధి):స్థానిక సిద్దిపేట మండలం రూరల్ పరిధిలో ఉన్నఇర్కోడ్ మోడల్ స్కూల్ కి చెందిన వేణు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి జపాన్ దేశ పర్యటనకు ఎంపిక కావడం రాష్ట్ర స్థాయిలో గర్వకారణంగా నిలిచింది. నెహ్రూ సైన్స్ కార్యక్రమం ఆధ్వర్యంలో జపాన్ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ విద్యా-శిక్షణా పర్యటనకు ఇర్కోడ్ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని కఠినమైన ఎంపిక ప్రక్రియ అనంతరం ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా జపాన్‌లోఈ నెల 24 నుండి 30 వరకు జరిగే శిక్షణా పర్యటనలో 4 గైడ్ టీచర్లు...