manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 1:16 pm Editor : Mana Praja Prathinidhi

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి – రైతుకు రూ.80 వేల నష్టం

మెదక్.మనప్రజాప్రతినిధి//జనవరి19
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒక ఎద్దు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, ముస్లాపూర్ గ్రామానికి చెందిన తలారి నర్సింలు తన ఎద్దులను మేత మేపేందుకు వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పొలాల్లో ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా ఎద్దుకు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.కళ్లముందే తన ఎద్దు మృతి చెందడంతో రైతు నర్సింలు కన్నీటిపర్యంతమయ్యాడు. మృతి చెందిన ఎద్దు విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఈ సంఘటనతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని వాపోయిన నర్సింలు, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని కోరుతున్నాడు.