దేవాలయ భూముల కబ్జాలపై ఆగ్రహం… రాజరాజేశ్వరి దేవి ఆలయ భూమిని రక్షించాలని గ్రామస్తుల డిమాండ్

•రాజరాజేశ్వరి దేవి ఆలయ భూమిపై అక్రమ ఆక్రమణ ఆరోపణలు•పవిత్ర దేవాలయ భూమికే రక్షణ కరువు తిరుపతిజిల్లా,జనవరి20:(మనప్రజాప్రతినిధి)తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుమల నగర్ పంచాయతీ పరిధిలోని కోళ్ల ఫారం గ్రామంలో ముప్పై సంవత్సరాలుగా వెలసి ఉన్న రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. సర్వే సంఖ్య 229 లోని దేవాలయ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దేవాలయ భూమి కబ్జా విషయమై గ్రామస్తులు గ్రామ రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేయగా, సంఘటన స్థలానికి చేరుకున్న అధికారి...