manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 11:11 am Editor : Mana Praja Prathinidhi

సదాశివపేట మున్సిపల్ అభ్యర్థుల ప్రకటన<br>

స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో అభ్యర్థులను ప్రకటించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి

మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపు
ఐక్యంగా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలి:నిర్మలాజగ్గారెడ్డి
ప్రత్యర్థుల మైండ్ గేమ్‌లకు లోనుకావద్దు.

సదాశివపేట,జనవరి29(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గురువారం రోజున స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీజీఐఐసీచైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.ఈసందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.ఈ కార్యక్రమంలోమాట్లాడిన నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ…పార్టీ పరంగా ఎవరికి అవకాశం లభించినా మిగిలిన కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకుని సదాశివపేట మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమష్టి కృషితోనే విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఆడే మైండ్ గేమ్‌లకు లోనుకాకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా ప్రతి వార్డులో కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.
వార్డు వారీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వివరాలు:
1వ వార్డు – పిల్లోడి విశ్వనాథం.2వ వార్డు – ఎరుకల నర్సింలు.
3వ వార్డు – రేణుక చిరంజీవి.4వ వార్డు – మొయిజ్.5వ వార్డు – ఉత్తేజ ఫాతిమా.7వ వార్డు – అనిత విష్ణువర్ధన్ రెడ్డి.8వ వార్డు – రేణుక శ్రీనివాస్ గౌడ్.9వ వార్డు – అరుణ్ కుమార్.10వ వార్డు – కంది నర్సింలు.11వ వార్డు – గోపి ప్రియాంక.12వ వార్డు – పులి మామిడి మమత రాజు.13వ వార్డు – భవానీవిశ్వనాథం.14వ వార్డు-స్వరూప రమేష్.15వ వార్డు – గోసియ బేగం.16వ వార్డు – కొత్తగొల్ల చంద్రశేఖర్.17వ వార్డు – షాజీ.18వ వార్డు – నికిత ప్రేమ కుమార్19వ వార్డు – రోజా నాగరాజు.20వ వార్డు-అంజమ్మ సత్యనారాయణ 21వ వార్డు – వాజిద్.22వ వార్డు – పట్నం విజయలక్ష్మీసుభాష్.23వ వార్డు – లక్ష్మీ ప్రియ భరత్24వ వార్డు – కలిం.25వ వార్డు – శంకర్ గౌడ్.26వ వార్డు – హారిక విజయ్ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు.