మనప్రజాప్రతినిది
రాజన్న సిరిసిల్ల
జనవరి ,08
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 4వ తేదీన నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సబ్-జూనియర్ ఖో-ఖో పోటీల్లో ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ విద్యార్థిని కె. అవంతిక అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా సెక్రెటరీ మహేందర్ రావు వివరాలను వెల్లడించారు.
రాష్ట్రస్థాయి పోటీల వేదిక: ఈ నెల 18, 19, 20 తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలోని నర్సంపేటలో రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలు జరగనున్నాయి.అత్యున్నత ప్రతిభతో రాష్ట్రస్థాయికి ఎంపికైన అవంతికను పాఠశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్, పీఈటీ (PET) రాజశేఖర్ మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ చాటి జిల్లాకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.